dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్.. అదిరిపోయే మాస్ ఫార్ములాతో..

అదిరిపోయే మాస్ ఫార్ములాతో..

                  లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్..




సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. 

Image



 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది, రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అది అలా ఉంటే తాజాగా ఈ సినిమాలో బన్నీ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని సమాచారం. 


Image


ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇంకోంత సమాచారం ఏమంటే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. 


Image


సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది. చూడాలి మరి.. సుకుమార్ రంగస్ధలం మ్యాజిక్ రిపీట్ చేస్తాడా.. అంతకు మించి ఈ సినిమా ఉండనుందా..

















లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్.. అదిరిపోయే మాస్ ఫార్ములాతో.. లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్.. అదిరిపోయే మాస్ ఫార్ములాతో.. Reviewed by D Wire Cutter on January 11, 2020 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video