ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఆర్టికల్ మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు!!!!

ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఆర్టికల్ మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు!!!!

మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు!!!!

 ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఆర్టికల్ మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు!!!!            Image credited from Google.com respectivelyఫ్రెండ్ , దోస్త్,  స్నేహితుడు ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఆ పిలుపులో ఉండే తీయదనం ఒక్కటే. అమ్మ నాన్న అక్క చెల్లి అన్నా తమ్ముడు భార్య భర్త తాతయ్య నానమ్మ ఇలా ఎన్నో బంధాలు ఉన్నా ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప బంధం ఎలాంటి స్వార్థం లేకుండా ఒకరి మంచిని కోరుకునే బంధం కేవలం స్నేహబంధం మాత్రమే.ఈ ప్రపంచంలోకి నువ్వెవరో నీ వాళ్ళు ఎవరో  అనేది తెలియకుండానే వస్తావు. నువ్వు పుట్టగానే ముందుగా చూసేది నీ తల్లిదండ్రులని కాబట్టి వాళ్ళు ఎవరో నీకు తొందరగానే తెలిసిపోతుంది. ఆ తర్వాత నీ తోబుట్టువులు నీ బంధువులు ఎవరో తెలిసి పోతారు అవన్నీ రక్త సంబంధాలు. ఆ తర్వాత మెల్లగా నీకు లోకజ్ఞానం తెలుస్తుంది ఈ ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతావ్ అప్పుడు అప్పుడు నువ్వు నిజంగా నీకే మాత్రం సంబంధం లేని మనుషులను చూడటం మొదలు పెడతావ్ అతను/ఆమె నీ కులం కాదు నీ మతం కాదు నీ ప్రాంతం కాదు అసలు నీకు అప్పటి వరకు పరిచయమే లేదు కానీ ఆ ఒక్క మనిషిని చూడగానే నీలో ఒక తెలియని సంతోషం నీలో ఒక తెలియని ఆనందం వాళ్లతో మాట్లాడాలని... అప్పటికి నువ్వు ఈ భూమి మీద పుట్టి కొన్ని సంవత్సరాలు గడిచినా ఆ ఒక్క ఫ్రెండును కలుసుకున్న క్షణం నుంచి నిజంగా నీకు నీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు అనిపిస్తుంది. ఇక ఆరోజు నుంచి నీ జీవితంలో ఉండే అన్ని క్షణాలను ఆ దోస్త్ తో పంచుకుంటూ ఉంటావ్ అప్పటి వరకు నీ ప్రపంచం నీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యులు అయితే ఆ రోజు నుంచి నీకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. నీ ఫ్రెండ్ తో నువ్వు మాట్లాడుతున్న మాటలు తిరిగే ప్రదేశాలు మీ ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు నీకు జీవితంలోనే అత్యంత తీయనైన జ్ఞాపకాలను ఇవ్వడం మొదలు పెడతాయి.

నీ లైఫ్ లోకి ఒక ఫ్రెండ్ వచ్చే వరకు అమ్మ కొట్టినా నాన్న తిట్టినా నీలో నువ్వు బాధ పడతావు లేకపోతే అమ్మ కూచి లాగనో నాన్న కూచి లాగనో ఉంటావు. కానీ ఆ ఒక్క స్నేహితుడు పరిచయమయ్యాక నీ జీవితంలో జరిగే ప్రతీది తనతో పంచుకోవాలనుకుంటావ్ తనకు చెప్పాలనుకుంటావ్ నీకు అమ్మ మీద కోపం ఉన్నా నువ్వు నాన్న మీద అలిగినా అవన్నీ చెప్పుకునేది నీ ఫ్రెండ్ కు మాత్రమే.

నీ జీవితంలో అందరికంటే ఎక్కువగా నీకు అన్ని నేర్పించేది ఎవరో తెలుసా నీ ఫ్రెండ్.


మొట్టమొదటిగా నువ్వు బూతులు నేర్చుకునేది నీ ఫ్రెండ్ దగ్గరే!!!


స్కూల్లో క్లాసులు బంక్ కొట్టేది కూడా మొదట తనతోనే స్టార్ట్ చేస్తావ్!!!ఫస్ట్ టైం నువ్వు బీర్ తాగేది కూడా తనతోనే!!!నువ్వు టీనేజ్ లోకి అడుగుపెట్టాక ఒక అమ్మాయిని చూసి నీకు ఏదైనా ఫీలింగ్ కలిగితే అందరికంటే ముందుగా అది నువ్వు చెప్పాలనుకునేది చెప్పేది నీ ఫ్రెండ్ తోనే!!!అసలు అప్పటి అప్పటి వరకు అబద్ధం అంటే ఏంటో కూడా నీకు తెలియదు కానీ ఆ అల్లరి ఫ్రెండ్ నీ జీవితం లోకి వచ్చాక అమ్మానాన్నలకు కూడా అలవోకగా అబద్ధాలు చెప్పేస్తావ్!!!హింస... ఆ రోజు వరకు దాని లక్షణాలు కూడా ఎలా ఉంటాయో నీకు తెలియదు కానీ ఫస్ట్ టైం నువ్వు నీ ఫ్రెండును కొట్టినప్పుడు లేకపోతే నీ ఫ్రెండ్ కోసం ఇంకొకరిని కొట్టినప్పుడు దానితో కూడా నీకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోతుంది!!!క్లాసులో అందరి ముందు టీచర్ నిన్ను అవమానిస్తే అందులో నీ తప్పు ఉన్నా కూడా అదే టీచర్ ని నీ ముందు బండ బూతులు తిట్టి నిన్ను సంతోషపెట్టే వాడే నీ ఫ్రెండ్!!!ఇంట్లో నాన్న జేబులో నుంచి డబ్బులు ఎలా తీసుకురావాలి అన్న  టెక్నిక్ ని అత్యంత అద్భుతంగా నీకు నేర్పించేవాడు!!!సినిమాల్లో హీరోయిన్ ఎక్స్ పోజింగ్ చేస్తారని వాళ్లను ఆ యాంగిల్లో చూసి ఎంజాయ్ చేయాలని మొదట నీకు ఙ్ఞానోదయం చేసేవాడే నీ ఫ్రెండ్!!!సందు చివర నిలబడి అమ్మాయిలకి లైన్ వెయ్యాలి అని లవ్ లో ఏ బి సి డి లు నేర్పించేది కూడా వాడే!!!నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా లవ్ లెటర్ రాశావు అంటే కచ్చితంగా అందులో నీ స్నేహితుడి ఇన్వాల్వ్మెంట్ ఉండే ఉంటుంది!!!అప్పు ఈ పదానికి అర్థము పరమార్థము మొట్టమొదటిగా నువ్వు తెలుసుకునేది నీ స్నేహితుడి దగ్గరే!!!ఒక హీరో సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ కు వెళ్లి ఈల వేసి గోల చేయాలని చేసి చూపించేది కూడా వాడే!!!ఎప్పుడైనా నీకు నీ స్నేహితుడికి మధ్య గొడవ జరిగితే వాడి మీద కోపంతో నువ్వు ఇంకొక వాడికి క్లోజ్ అయ్యే ఉంటావ్... మళ్ళీ మీరిద్దరూ కలిసాక ఆ ఇంకొకడి మీద జోకులు వేసుకునే ఉంటారు!!రేయ్ ఈరోజు శీను గాడు స్కూలుకు ఎందుకు రాలేదురా అని కచ్చితంగా రవి గాడిని మాత్రమే సార్ అడుగుతాడు ఎందుకంటే ఒకడి గురించి అందరికంటే ఎక్కువగా తెలిసేది ఆడి ఫ్రెండ్ కు మాత్రమే!!!


నువ్వు ఫస్ట్ టైం అబద్ధం చెప్పింది 

నువ్వు ఫస్ట్ టైం సిగరెట్ తాగింది

నువ్వు ఫస్ట్ టైం మందు కొట్టింది

నువ్వు ఫస్ట్ టైం కిస్ పెట్టింది

నువ్వు ఫస్ట్ టైం సెక్స్ చేసింది

ఇవన్నీ ప్రపంచంలో ఎవరికీ తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా తెలిసేది మాత్రం మీ స్నేహితుడికి మాత్రమే!!!


నీ లవ్ స్టోరీ సక్సెస్ అయిందంటే కచ్చితంగా నీకు నీ ఫ్రెండ్ హెల్ప్ చేసే ఉంటాడు!!!


నీ లవ్ స్టోరీ ఫెయిల్ అయితే నువ్వు ఏడుస్తావ్ ఏదో ఒక రోజు ఆ అమ్మాయిని మర్చిపోతావ్ కానీ నీ పక్కనే ఉన్న ఫ్రెండ్ తన గుండె పగిలినంత నొప్పి గా ఫీల్ అవుతాడు నీ బాధని వాడు జీవితాంతం అనుభవిస్తాడు!!!


నువ్వు టీ తాగుదాం రారా అంటే వాడు కచ్చితంగా నీ దగ్గర చిల్లర ఉందా లేదా అని అడుగుతాడు!!!


నువ్వు కొత్తగా బండి కొంటే దానికి నీ కంటే ముందు ఆక్సిడెంట్ చేసేది కూడా వాడే!!!


నీ శత్రువుని నీ కంటే ఎక్కువగా ద్వేషించేది నీ ఫ్రెండే!!!


నీతో అప్పు చేయించి మరి పార్టీ తీసుకునేది ఈ ప్రపంచంలో వాడు ఒక్కడు మాత్రమే!!!

నీ కుటుంబ సభ్యుడు కానీ కుటుంబ సభ్యుడు వాడే!!!


లవర్ తో విడిపోయాం అని ఏడ్చిన వాళ్ళకంటే స్నేహితుడితో విడిపోయాం అని ఏడ్చిన వాళ్ళే ఈ ప్రపంచంలో ఎక్కువ!!!


నువ్వు అబద్దం చెప్తున్నావ్ అని ప్రతిసారి కనిపెట్టేది 
నీ ఫ్రెండ్ మాత్రమే!!!


తల్లి కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అనేవి నిజాలే అయితే ఫ్రెండ్ మనసు చూస్తాడు!!!


రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసినా భయంకరమైన వర్షంలో అయినా చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఈ ప్రపంచంలో నిన్నెవరు నమ్మకున్నా ప్రతిసారి స్పందించేవాడు నీ ఫ్రెండ్!!!


నీ కోసం ఇంటికి నీ ఫ్రెండ్ వస్తున్నాడు అంటే 

నీకంటే ఎక్కువ సంతోష పడేది నీ తల్లిదండ్రులే!!!

నీ స్నేహితుడు ఎవరో కాదు మీ అమ్మానాన్నలు కనిపెంచని మరో బిడ్డే!!!

దేవుడికి కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు లేకపోతే ఎలా చిల్ అవుతాడు!!!

మీరు కూడా ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా మీ బెస్ట్ ఫ్రెండ్ తో చిల్ అవ్వండి ఎదవ నా కొడుకు/కూతురు ఏ తల్లి కన్న బిడ్డో మీకు మాత్రం అమ్మగా నాన్నగా అక్కగా చెల్లిగా అన్నగా తమ్ముడిగా అన్నీ అయిపోయి మీకు ఫ్రెండ్ అయిపోయాడు ఈ జన్మకు వాడు మిమ్మల్ని వదలడు మీరూ వాడిని వదలకండి!!!

Post a comment

0 Comments