Header Ads

NANI-V-MOVIE REVIEW

నాని "వి" మూవీ రివ్యూ - పర్వాలేదనిపించే థ్రిల్లర్!!!!


Image

నాని "వి" మూవీ రివ్యూ - పర్వాలేదనిపించే థ్రిల్లర్!!!!

:హీరో నాని 25 వ సినిమా "వి" ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. కరోనా ఎఫెక్ట్స్ వలన సినిమా హాల్స్ అన్నీ క్లోజ్ అవడంతో చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ కు ఇచ్చేశారు. అటు హిందీలో మిగతా భాషల్లో సినిమాలు డైరెక్ట్ గా  ఓటిటిలో రిలీజ్ అయినప్పటికి తెలుగులో అలా రిలీజ్ అయిన మొదటి పెద్ద సినిమా ఇదే... నాని లాంటి హీరో సినిమా కావడంతో అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి "వి"  సినిమా ఆ అంచానాలు అందుకుందా లేదా చూద్దాం.


Image


కథ : డీసీపీ ఆదిత్య మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్ తన సర్వీస్ లో ఎంతో మంది క్రిమినల్స్ ను పట్టుకుని ఎన్నో మెడల్స్ గెలుచుకుని అటు డిపార్ట్ మెంట్ లో ఇటు ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి... అయితే సడెన్ గా సిటీలో ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్ జరుగుతుంది అక్కడ శవం మీద హంతకుడు తనకు డీసీపీ ఆదిత్య కావాలని అతనే తనని పట్టుకోవాలని లేకపోతే తన మెడల్స్ తిరిగి ఇచ్చి తన జాబ్ కు రాజీనామా ఇవ్వాలని ఓపెన్ చాలెంజ్ చేస్తాడు. దాంతో ఈ కేసు ఆదిత్య పై ఆఫీసర్ అతనికే అప్పగిస్తాడు... ఆదిత్య కిల్లర్ ను పట్టుకోవాలని ట్రై చేస్తుంటే అంతనికే ఫోన్ చేస్తూ ఛాలెంజ్ చేస్తూ మరి కిల్లర్ ఇంకో ఇద్దరినీ కూడా చంపుతాడు ఈలోపు కిల్లర్ గురించి కొన్ని క్లూస్ తెలుసుకున్న ఆదిత్య ఆ కిల్లర్ మాజీ ఆర్మీ ఆఫీసర్ విష్ణు అని తెలుసుకుంటాడు... అసలు విష్ణు ఎందుకు ఆ మర్డర్స్ చేస్తున్నాడు అతని గతం ఏంటి? ఆదిత్య విష్ణును  పట్టుకున్నాడా? చివరికి ఏం జరిగింది అనేదే మిగతా కథ. 


విశ్లేషణ :


Image


థ్రిల్లర్ సినిమాలో ఎప్పుడూ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ సినిమాలో ఉంటే  చూసే ప్రేక్షకుడు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తాడు... అలా కాకుండా అసలేం జరుగుతోంది కిల్లర్ ఎందుకు మర్డర్స్ చేస్తున్నాడు అతని కథేంటి అంటూ సినిమా చివరి వరకూ ఎదురు చూడ్డం అన్నది సినిమా కథలో ఉన్న డొల్లతనాన్ని బయట పెడుతుంది. తననే సవాల్ చేసి వరస హత్యలు చేస్తున్న కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ట్రై చేయడం సినిమా చివరి వరకూ ఇద్దరు ఎదురు కాకపోవడంతో సినిమా అంతా ఫ్లాట్ గా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కిల్లర్ ఒక మర్డర్ చేస్తే కనీసం ఇంకో మర్డర్ ను అయినా హీరో ఆపడం ద్వారా కిల్లర్ కే ప్రతి సవాల్ విసిరితే అప్పుడు కథ రసకందాయంలో పడి చూసే ప్రేక్షకున్ని కట్టి పడేస్తుంది... "వి" లో అలాంటి మూమెంట్స్ లేకపోగా సెకండ్ హాఫ్ లో ఒకసారి కిల్లర్ (నాని పాత్ర విష్ణు) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అతను ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు అతని లైఫ్ లో ఏం జరిగింది అన్నది ఎవరైనా ఇట్టే గెస్ చేస్తారు. ఇప్పటికే చాలా థ్రిల్లర్ సినిమాల్లో వచ్చిన స్క్రీన్ ప్లేను ఫాలో అయినా కూడా కథా, కథనాల్లో దమ్ము లేకపోవడం వలన ఎలాంటి ఇంట్రెస్ట్ సినిమాలో కనిపించదు.


ఇక నటుడిగా నాని గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది లేదు అతను ప్రూవుడ్ స్టార్... తనతో పాటు సమాన లెంగ్త్ ఉన్న పాత్రను సుధీర్ బాబు చేయడం తన పాత్ర హత్యలు చేస్తూ ఉంటే సుధీర్ బాబు పాత్ర హీరోయిన్ తో రొమాన్స్, పాటలు పాడుకోవడం లాంటి రెగ్యులర్ కమర్షియల్ హీరో బిల్డప్ ఉన్నా కూడా నాని తన పాత్ర చేశాడంటే అతనికి సినిమా మీద ఉన్న కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. తన పాత్రలో నాని బాగానే నటించాడు కిల్లర్ పాత్రలో ఒదిగిపోయి వేరే పాత్రలు హింస గురించి మాట్లాడితే వాళ్ళను భయపెడుతూ అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ గా ఇలా తన పాత్రల్లో మంచి వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. 

Image

ఇక పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. నివేతా, అదితిలు ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా పండింది. దర్శకుడిగా ఇంద్రంగంటి మోహన కృష్ణ బాగానే సినిమాను డీల్ చేసాడు, డైలాగ్స్ లో అక్కడక్కడా మెరుపులు కనిపించాయి. పి. జి. వింద ఫోటోగ్రఫీ బాగుంది అన్ని లోకేషన్స్ ను అందంగా రిచ్ గా చూపించింది. ఇక అమిత్ త్రివేది పాటల్లో వస్తున్నా వచ్చేస్తున్నా ఒక్కటే ఆకట్టుకుంటుంది. తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతంలో ఎందుకో తమిళ సినిమా రాక్షసన్ మ్యూజిక్ వినిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


చివరగా:

నాని 25వ సినిమా ఆయన తొలిసారి విలన్ గా నటిస్తున్నారు అంటూ "వి" సినిమా మీద మొదటి నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది అటు నాని ఫ్యాన్స్ ఇటు సగటు సినీ అభిమాని కూడా ఈ సినిమా గురించి ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూసారు. అయితే కథా కథనాల్లో ఇంకొంచెం శ్రద్ద చూపించి ఉంటే సినిమా ఇంకో లెవల్ లో ఉండేది నాని 25వ సినిమా నిజంగానే అతనికి ఒక స్పెషల్ ఫిల్మ్ అయ్యేది.CINEMA RASCALS RATING : 3/51 comment: